ap: బ్యాంకాక్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఏపీ యువకుడు

  • ఈతకొలనులో పడి వెంకటేష్ అనే యువకుడి మృతి
  • మృతుడి స్వస్థలం మచిలీపట్నం
  • హైదరాబాదులో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పని చేస్తున్న వెంకటేష్
కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు బ్యాంకాక్ లో దుర్మరణం చెందాడు. మచిలీపట్నంకు చెందిన వెంకటేష్ అనే యువకుడు హైదరాబాదులో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఇటీవల ఆఫీస్ పనిమీద స్నేహితులతో కలసి ఆయన బ్యాంకాక్ వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు ఈతకొలనులో పడి మృతి చెందాడు. వెంకటేష్ మరణ వార్త విని అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ స్నేహితుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న స్నేహితులు కంటతడి పెడుతున్నారు. వెంకటేష్ మృత దేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి బ్యాంకాక్ అధికారులతో ఏపీ అధికారులు మాట్లాడుతున్నారు. 
ap
man
death
bangkok

More Telugu News