Rahul Gandhi: తన వివాహంపై స్పందించిన రాహుల్ గాంధీ!

  • పత్రికా సంపాదకులతో సమావేశమైన రాహుల్ గాంధీ
  • నా వివాహం ఎప్పుడో కాంగ్రెస్ తో జరిగిపోయింది
  • పెళ్లి గురించి ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చిన రాహుల్
రెండు రోజుల తెలంగాణ పర్యటన నిమిత్తం వచ్చిన రాహుల్ గాంధీ, ఈ ఉదయం పత్రికా సంపాదకులతో సమావేశమైన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

"నా వివాహం ఎప్పుడో కాంగ్రెస్ పార్టీతో జరిగిపోయింది" అని ఆయన అన్నారు. తాను మరోసారి ప్రధాని అవుతానని మోదీ భ్రమల్లో బతుకుతున్నారని, ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 230 సీట్లు రాకుంటే, మోదీ ప్రధాని అయ్యే ప్రశ్నే లేదని, బీజేపీయే స్వయంగా మరో అభ్యర్థిని పీఎంగా ప్రకటిస్తుందని రాహుల్ జోస్యం చెప్పారు. అంతకుముందు బేగంపేటలో ఉన్న హరిత ప్లాజాలో పార్టీ నేతలతో సమావేశమైన రాహుల్, ఎవరిపైనా ఎవరూ ఫిర్యాదులు చేయవద్దని, ఏమైనా సలహాలు, సూచనలు మాత్రమే చేయాలని అన్నారు.
Rahul Gandhi
Hyderabad
Editors
Marriage
Congress

More Telugu News