YSRCP: 91210 91210కు మిస్డ్ కాల్ ఇవ్వండి... జగన్ మాట్లాడతారు!: వైకాపా

  • చంద్రబాబు పాలన నుంచి విముక్తి పొందండి
  • మిస్డ్ కాల్ ఇచ్చి వైఎస్ఆర్ కుటుంబంలో చేరండి
  • ఇబ్బందులను, సమస్యలను చెప్పుకోవచ్చన్న వైకాపా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ పాలన నుంచి విముక్తిని పొందాలంటే, వైఎస్ఆర్ కుటుంబంలో చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలను కోరింది. వైఎస్ఆర్ కుటుంబంలో చేరడానికి 91210 91210 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలని, పార్టీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా మాట్లాడవచ్చని తెలిపింది. కార్యాలయంలో జగన్ ఉన్న సమయంలో ఆయనే స్వయంగా మాట్లాడతారని, మిస్డ్ కాల్ ఇచ్చిన వారికి ఆయన ఫోన్ చేస్తారని పేర్కొంది. చంద్రబాబు పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను, తమ ప్రాంత సమస్యలను గురించి చెప్పుకోవచ్చని పేర్కొంది.
YSRCP
jagan
Phone Number

More Telugu News