Pawan Kalyan: ‘జనసేన’ గుర్తు ‘పిడికిలి’: పవన్ కల్యాణ్

  • సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నం ‘పిడికిలి’
  • రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే
  • డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది  
‘జనసేన’ గుర్తు ‘పిడికిలి’ అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని, అన్ని కులాలు, అన్ని మతాలూ కలసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుతామని అన్నారు.

 రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే కనబడుతున్నాయని, ప్రజల బాధలు వింటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో, పట్టణాల్లో చెత్త పేరుకుపోయి ప్రజల జీవనం దుర్భరంగా మారిపోతోందని అన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయిందని, చెత్త కుప్పల చెంతనే జీవనం, దోమల బెడద, ఈగలు ముసిరిన ఆహారం తినాల్సిన పరిస్థితులు కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు.
Pawan Kalyan
nidadavolu

More Telugu News