somnath chatterjee: ఆయన కోరిక ప్రకారం సోమ్ నాథ్ ఛటర్జీకి అంత్యక్రియలు చేయడం లేదు..!

  • తనకు అంత్యక్రియలను నిర్వహించవద్దంటూ 2002లో కోరిన సోమ్ నాథ్
  • పరిశోధనల నిమిత్తం ఆసుపత్రికి ఇవ్వాలంటూ విన్నపం
  • అసెంబ్లీ వద్ద 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పణ

జీవితాంతం విలువైన రాజకీయాలకు కట్టుబడి ఉన్న లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ ఛటర్జీ (89) ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. యావత్ దేశం గర్వించదగ్గ కమ్యూనిస్ట్ నేత అయిన సోమ్ నాథ్ కు గౌరవపూర్వకంగా, అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, ఆయన అంత్యక్రియలు జరగడం లేదు. తన మరణానంతరం తనకు అంత్యక్రియలను నిర్వహించవద్దని, పరిశోధనలకు ఉపయోగపడేలా తన భౌతికకాయాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి ఇవ్వాలని 2002లో ఆయన కోరడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో, ఆయన కోరుకున్న విధంగా ఆయన పార్థివదేహాన్ని స్థానిక ఎస్ఎస్కేఎం హాస్పిటల్ కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆయన పార్థివదేహాన్ని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ వద్ద కాసేపు ఉంచారు. ఈ సందర్భంగా 21 తుపాకులతో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

More Telugu News