illegal contact: తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ మహిళపై మరో మహిళ దాడి.. స్తంభానికి కట్టేసి కొట్టిన వైనం!

  • నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో దారుణం
  • బాధితురాలిపై భార్య, ఆమె బంధువుల దాడి
  • అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలు
తన భర్తతో అక్రమం సంబంధం పెట్టుకుందంటూ ఓ మహిళ, ఆమె తరపు బంధువులు... మరో మహిళపై దాడి చేశారు. ఆమెను స్తంభానికి కట్టేసి కొట్టారు. దీంతో, బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఆల్వాల్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే మహిళ తన భర్తతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోందనే అనుమానంతో రేణుక ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ తెల్లవారుజామున తన బంధువులతో కలసి ముత్యాలమ్మను చితకబాదింది. వెంటనే తోటి గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో, వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. 
illegal contact
attack
Nalgonda District

More Telugu News