Kurnool District: నువ్వు అందంగా ఉంటావు... నువ్వంటే ఇష్టం... ఇక చెప్పు!: బాధితురాలితో ఎస్ఐ సంభాషణ రికార్డు ఇది!

  • సివిల్ పంచాయితీని పరిష్కరించిన ఎస్ఐ
  • దాన్ని అలుసుగా తీసుకుని లైంగిక వేధింపులు
  • పగలు, రాత్రి ఫోన్ చేసి విసిగించాడంటున్న బాధితురాలు

ఓ సివిల్ పంచాయితీ నిమిత్తం వెళితే, దాన్ని పరిష్కరించిన కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎస్సై వెంకటసుబ్బయ్య, అదే అదనుగా బాధితురాలు కుంచాల లక్ష్మీదేవిని లైంగికంగా వేధించిన విషయంలో సస్పెండైన సంగతి తెలిసిందే. 7989231256, 9121101182 నంబర్ల నుంచి వెంకటసుబ్బయ్య తనకు రాత్రనకా, పగలనకా ఫోన్లు చేసి విసిగిస్తుండేవాడని చెప్పింది.

గట్టిగా మందలిస్తే, తనను, తన భర్తను ఏదైనా చేస్తాడన్న భయంతో సున్నితంగా వారించాలని చూస్తే, వేధింపులు పెరిగాయని బాధితురాలు వాపోయింది. తాను అందంగా ఉన్నానని, తనంటే ఇష్టమని చెబుతూ, కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, అందుకు సంబందించిన ఫోన్ కాల్స్ రికార్డును ఎస్పీ ముందుంచింది. అందులో అమ్మా అమ్మా అంటూనే తన మనసులోని ఉద్దేశాన్ని చెప్పాడా ఎస్ఐ... దాన్ని మీరూ ఈ వీడియోలో వినవచ్చు.

ఎస్ఐ: ఒక్క మాట చెప్పు... ఏదో ఒకటి
బాధితురాలు: హూ...
ఎస్ఐ: నీ ఇష్టం... ఏమ్మా
బాధితురాలు: చెప్తానులే
ఎస్ఐ: నువ్వు చెప్పమ్మా... నువ్వు చెప్పు
బాధితురాలు: నేనేం చెప్తాను సార్?
ఎస్ఐ: అట్లకాదమ్మా... ఏదో ఒక మాట చెప్పు
బాధితురాలు: ఏదో ఒకమాట ఏం చెప్పాలి సార్?
ఎస్ఐ: నేను బయటకు వచ్చేసినా... ఏదో ఒక మాట అను?
బాధితురాలు: నువ్వు చెప్పు సార్... ఏదో డైరెక్టుగా... నేనూ చెబుతాను
ఎస్ఐ: నువ్వంటే ఇష్టం
బాధితురాలు: హూ
ఎస్ఐ: సరేనా?
బాధితురాలు: హూ
ఎస్ఐ: దానికి చెప్పు
బాధితురాలు: ఏం చెప్పాలి సార్?. నా మొగుడిని కాదని, దాటుకుని మీకాడికి వస్తే... రేపు నన్ను, నా పిల్లలనూ వదిలేస్తే ఏడ బతకాలి సార్?
ఎస్ఐ: తెలియకుండా రా.
బాధితురాలు: హూ
ఎస్ఐ: తెలియకుండా వచ్చేయ్
బాధితురాలు: తెలియకుండా అయినాగానీ, మొగుడిని దాటుకోని ఎలా రావాలి సార్ మీ కాడికి? 12 గంటలప్పటి నుంచి ఫోన్ చేస్తున్నావు సార్. మొన్న చేసినవ్ నైట్ 2 గంటల కాడ. చెప్పినా కదా సార్ నేను... రాత్రి పూట ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దని.
ఎస్ఐ: చేయను... చేయను... సరేనా?
బాధితురాలు: హూ
ఎస్ఐ: పగలు పూట చేద్దునా? పగలు పూట...
బాధితురాలు: హూ... సర్లే సార్
ఎస్ఐ: ఇంటికాడికా రావచ్చునా?
బాధితురాలు: చెప్తా సార్
ఎస్ఐ: ఏమని?
బాధితురాలు: పొద్దున ఫోన్ చేసి చెప్తాసార్... భయమైతుంది.
ఎస్ఐ: అట్లా కాదుగానీ... ఇప్పుడు నేను బయటకు వచ్చినా... ఇబ్బందేమీ లేదు. ఏదో ఒక మాట టక్కు చెప్పేసెయ్.
బాధితురాలు: పొద్దున చెప్తలే సార్.
ఎస్ఐ: అట్ల కాదు... నేను చెప్పిన మాట బాగా విను. ఇప్పుడు ఏదో ఒక మాట చెప్పేయ్.
బాధితురాలు: చెబుతున్నా కదా సార్... పొద్దున చెబుతా సార్... నాకు భయమవుతుంది.
ఎస్ఐ: పొద్దున వేరే పనుంటది నాకు. నేను బయటకు వచ్చేసినా...
బాధితురాలు: ఇప్పుడు చెప్పలేను సార్... భయమవుతుంది.
అంటూ సాగిందీ సంభాషణ. దీన్ని రికార్డు చేసిన సదరు బాధితురాలు తన గోడును ఉన్నతాధికారుల వద్ద వెళ్లబోసుకుంది.

More Telugu News