CBFC: సినిమాల్లో పొగ తాగే హీరోలే బయట వద్దని చెప్పాలి: సీబీఎఫ్‌సీ

  • సరికొత్త ఆలోచన చేస్తున్న ప్రభుత్వం
  • శ్యాం బెనగల్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని నిర్ణయం
  • పొగ తాగే హీరోలతో లఘు చిత్రాలు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సరికొత్త ఆలోచనతో ముందుకొస్తోంది. సినిమాల్లో సిగరెట్ తాగుతూ కనిపించే హీరోలతోనే పొగ తాగొద్దని అవగాహన కల్పించే షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సీబీఎఫ్‌సీ సీఈవో అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు.

గోవాలోని మజోర్డాలో నిర్వహించిన టొబాకో లీడర్‌షిప్ కార్యక్రమంలో ఆదివారం ముగింపు సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమాల్లో నటులు పొగ తాగుతున్నట్టు చూపించడం వల్ల యువత దానికి ప్రభావితులవుతున్నారని అన్నారు. కాబట్టి, శ్యాం బెనగల్ కమిటీ సూచనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ఇది కనుక అమల్లోకి వస్తే సినిమాల్లో పొగ తాగే హీరోలతోనే.. పొగ తాగవద్దని అవగాహన కల్పించే లఘు చిత్రాలు రూపొందిస్తామని శ్రీవాత్సవ తెలిపారు.

  • Loading...

More Telugu News