Kurnool District: కోరిక తీర్చాలని యువతికి ఎస్ఐ వేధింపులు... ఆధారాలతో పట్టించిన వైనం!

  • నిత్యమూ రాత్రి పూట వేధిస్తున్న ఆత్మకూరు ఎస్ఐ
  • కాల్ రికార్డు, డేటాతో ఎస్పీకి ఫిర్యాదు
  • వెంటనే విధుల నుంచి తొలగింపు

రాత్రి పూట 2 గంటలకు ఫోన్ మోగుతుంది. అవతలి నుంచి ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసు. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం వినాల్సి వస్తుందో తెలుసు. అయినా ఫోన్ ఎత్తాల్సిందే. తెల్లారేవరకూ తన కోరిక తీర్చాలని, కావాలంటే ఇప్పుడే ఇంటికి వస్తానని అవతలి నుంచి చెబుతుంటే, సమాధానం చెప్పలేక సతమతమై పోయిందో ఇల్లాలు. తన భర్త ఉన్నాడని, అతనికి అన్యాయం చేయబోనని మొత్తుకుంటున్నా వినలేదు.

అవతలి నుంచి ఫోన్ చేస్తున్నది కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్‌ ఎస్సై వెంకటసుబ్బయ్య. అతని వేధింపులు భరించలేకపోయిన ఆ మహిళ, ఫోన్ కాల్స్ రికార్డు, తన కాల్ డేటాను తీసుకుని డైరెక్టుగా కర్నూలు ఎస్పీ గోపీనాథ్ జట్టికి అందించి ఫిర్యాదు చేసింది. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించి వీఆర్ (వేకెన్సీ రిజర్వ్) కు పంపుతూ ఎస్పీ ఆదేశించారు. మొత్తం ఘటనపై విచారించి సమగ్ర నివేదికను అందించాలని అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని ఆదేశించారు.

  • Loading...

More Telugu News