Tirumala: మహా సంప్రోక్షణ క్రతువులో కీలక ఘట్టం ‘కళాకర్షణ’ ప్రారంభం

  • దాదాపు నాలుగు గంటలు సాగనున్న‘కళాకర్షణ’
  • కళలు కుంభంలోకి ఆవాహనం చేయనున్న పండితులు
  • రేపు ఉదయం అష్టబంధన కార్యక్రమం  

తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ క్రతువులో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈ క్రతువులో అత్యంత ప్రధానమైన ‘కళాకర్షణ’ కార్యక్రమం మొదలైంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో శ్రీవారి కళలను కుంభంలోకి ఆవాహనం చేయనున్నారు. స్వామి వారి మూలవిరాట్టు, అనుబంధ ఆలయాల విగ్రహాల కళలు కుంభంలోకి ఆవాహనం చేయనున్నారు.

‘కళాకర్షణ’లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 44 మంది రుత్వికులు,150 మంది వేద పండితులు, 20 మంది వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం, పాతయాగశాలలో ఏర్పాటు చేసిన యాగశాలకు 18 కుంభాలను ఊరేగింపుగా తరలించనున్నారు. 28 హోమగుండాల వద్ద ఈ కుంభాలను ఉంచి చతుర్వేద పారాయణం, మంత్రోచ్చారణ చేయనున్నారు. శ్రీవారి సన్నిధిలో నిర్వహించే కైంకర్యాలన్నీ మిగిలిన నాలుగు రోజుల పాటు యాగశాలలో నిర్వహిస్తారు. ఈ మహాక్రతువులో తదుపరి ఘట్టమైన అష్టబంధన కార్యక్రమం రేపు ఉదయం ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News