sonali bindre: సోనాలి బింద్రేను 'ఆమె నా హీరో' అంటున్న అనుపమ్ ఖేర్

  • సోనాలి బింద్రేతో కలిసి కొన్ని సినిమాల్లో నటించా
  • ముంబయిలో పలు సమావేశాల్లో మేము కలిశాం
  • ఆమెతో విలువైన సమయం న్యూయార్క్ లో గడిపా
హైగ్రేడ్ కేన్సర్ కు గురైన నటి సోనాలి బింద్రేను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స పొందుతున్న ఆమెను కలిసిన విషయాన్ని అనుపమ్ ఖేర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘సోనాలి బింద్రేతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. ముంబయిలో జరిగిన పలు కార్యక్రమాలు, సమావేశాల కోసం చాలాసార్లు మేము కలుసుకున్నాం. కానీ, ఆమెతో కలిసి విలువైన సమయం గడిపే అవకాశం ఇప్పుడు న్యూయార్క్ లో లభించింది. నేను కచ్చితంగా చెప్పగలను ఆమె నా హీరో’ అని చెప్పారు. 
sonali bindre
anupam kher

More Telugu News