Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌ తొలి ప్రధాన న్యాయమూర్తిగా గీతా మిత్తల్!

  • ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ గీతా మిత్తల్ 
  • గీతా మిత్తల్ ను అభినందించిన గవర్నర్ వోహ్రా
  • రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమం

జమ్ముకశ్మీర్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీతా మిత్తల్ నియమితులయ్యారు. ఆమెతో ఈ రోజు గవర్నర్ ఎన్ఎస్ వోహ్రా శ్రీనగర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు గవర్నర్ అభినందనలు తెలిపారు. రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి ఉషా వోహ్రా, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గవర్నర్ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు.  

  • Loading...

More Telugu News