TRS: కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు: టీఆర్ఎస్ పై దత్తాత్రేయ ఫైర్

  • ఫ్లైఓవర్ల నిర్మాణానికి రక్షణ భూములు ఇవ్వడానికి కేంద్ర సిద్ధంగానే ఉంది
  • సెక్రటేరియట్ కు బైసన్ పోలో గ్రౌండ్ ను ఇవ్వడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం
  • రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది

హైదరాబాదులో ఫ్లైఓవర్ల నిర్మాణానికి రక్షణ భూములు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉందని... అయినా కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ అనవసర ఆరోపణలు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. అయితే, సెక్రటేరియట్ నిర్మాణం కోసం బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వర్షాభావం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో కుర్రతనం తప్ప పరిపక్వత లేదని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో విపక్షాల అనైక్యత బయటపడిందని చెప్పారు. ఏ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News