shraddha kapoor: వచ్చేనెలలోనే సెట్స్ పైకి 'సైనా నెహ్వాల్' బయోపిక్

  • బాలీవుడ్లో బయోపిక్ ల జోరు 
  • సైనా నెహ్వాల్ బయోపిక్ కి సన్నాహాలు 
  • ఫిట్ నెస్ పై దృష్టిపెట్టిన శ్రద్ధా కపూర్      

బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు భారీస్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని బయోపిక్ లు రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టగా, ఆ ఉత్సాహంతో మరికొన్ని బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సైనా నెహ్వాల్' బయోపిక్ కి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను శ్రద్ధా కపూర్ పోషించనుంది.

ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. అయితే ఇతర ప్రాజెక్టులతో శ్రద్ధా కపూర్ బిజీగా ఉండటం వలన, ఈ బయోపిక్ కి అవసరమైన ఫిట్ నెస్ పై శ్రద్ధా కపూర్ దృష్టి పెట్టలేకపోయింది. ఇప్పుడు ఇతర ప్రాజెక్టులు ఒక దారిలో పడిపోవడంతో, శ్రద్ధా కపూర్ కసరత్తులు చేస్తోందట. దాంతో వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అటు సైనా నెహ్వాల్ కి .. ఇటు శ్రద్ధా కపూర్ కి మంచి క్రేజ్ ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై భారీగా అంచనాలు వున్నాయి. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని శ్రద్ధా కపూర్ భావిస్తోంది.  

  • Loading...

More Telugu News