puja hedge: బ్రిటిష్ ఎయిర్ వేస్ లో మరో భారతీయుడికి అవమానం.. మండిపడ్డ పూజా హెగ్డే!

  •  తన స్నేహితుడిని వేధించారన్న పూజ
  • 2 గంటల పాటు మంచి నీళ్లు ఇవ్వలేదని వెల్లడి
  • సిబ్బంది అమర్యాదకరంగా ప్రవర్తించారని మండిపాటు 
బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది మరోసారి భారతీయులపై జాతి వివక్షను ప్రదర్శించారు. విమానంలో గ్లాస్ నీళ్లు కోరగా.. రెండు గంటల పాటు ఇవ్వలేదు. అయితే పక్కనే ఉన్న మరో విదేశీయుడికి మాత్రం గ్లాసులకు గ్లాసులు మద్యం అందించారు. ఈ విషయాన్ని నటి పూజా హెగ్డే తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తన స్నేహితుడితో బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది అమర్యాదకరంగా వ్యవహరించారని మండిపడింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో పూజ వెల్లడించలేదు.

తన ట్విట్టర్ అకౌంట్ లో ‘వావ్..! నిన్న రాత్రి  బ్రిటిష్ ఎయిర్ వేస్ లో సిబ్బంది తన పట్ల ఎంత  జాతి వివక్షను ప్రదర్శించారో నా స్నేహితుడు నిన్న చెప్పాడు. అతను కేవలం గ్లాస్ మంచి నీళ్లు అడిగితే ఇవ్వకుండా రెండు గంటలు వెయిట్ చేయించారు. కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి గ్యాప్ లేకుండా మద్యం సప్లై చేశారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది అసహ్యకరంగా ప్రవర్తించారు’ అని పూజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
puja hedge
british airways
racist
indian
Twitter
India

More Telugu News