#GalaxyNote9: అదిరిపోయే ఫీచర్లతో గెలాక్సీ నోట్9 విడుదల!

  • న్యూయార్క్ లో విడుదలైన గెలాక్సీ నోట్9
  • రెండు వేరియంట్ లలో లభ్యం 
  • త్వరలో భారత మార్కెట్లోకి

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్9 ను తాజాగా న్యూయార్క్ లోని బ్రూక్లిన్‌లో ఆవిష్కరించింది. భారీ డిస్‌ప్లే తో పాటు హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, అధిక బ్యాటరీ బ్యాకప్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఏర్పాటు చేశారు. దీనిలో 'ఎస్ పెన్' ని బ్లూటూత్ కి అనుసంధానం చేయడం వల్ల సెల్ఫీలు సులభంగా తీసుకోవచ్చు.

టాప్ఎండ్ మోడల్ లో 512జీబీ అంతర్గత మెమొరీతో పాటు మెమొరీ కార్డు ద్వారా దీనిని 1టీబీ వరకు పెంచుకునే సౌకర్యం ఉంది. దీనిలో ఉన్న డెక్స్ సాఫ్ట్‌వేర్ సహాయంతో కంప్యూటర్ తరహాలో కూడా ఉపయోగించుకునే వీలుంది. 6జీబీ/128జీబీ ధర సుమారు రూ.68700 ఉండగా, 8జీబీ/512జీబీ ధర సుమారు రూ.85900గా ఉండే అవకాశం ఉంది. యూఎస్ లో ఈనెల 24నుండి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది.

గెలాక్సీ నోట్9 ప్రత్యేకతలు:

  • ఎస్ పెన్‌, డాల్బీ అట్మోస్, ఫింగ‌ర్‌ ప్రింట్ సెన్సార్‌
  • వెనక భాగంలో 12/12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ కెమెరాలు
  • ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 2960 x 1440 పిక్సల్స్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్
  • 6.4" అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌
  • 4000ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ చార్జింగ్‌

More Telugu News