satyameva jayate: సమాజంలో జరిగే ప్రతీ తప్పుకు ఓ మతాన్నే నిందిస్తే ఎలా?: జాన్ అబ్రహాం

  • ప్రపంచం బతకటానికి ప్రమాదకరంగా మారింది
  • ఒకే మతాన్ని నిందించే ఆలోచనను మానుకోవాలి
  • ఆగస్టు 15న విడుదల కానున్న సత్యమేవ జయతే

ప్రస్తుతం దేశంలో నెలకొన్న అశాంతి పరిస్థితులు, మూకహత్యలపై బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం స్పందించాడు. కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచమంతటా ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని వ్యాఖ్యానించాడు. సమాజంలో జరిగే ప్రతీ తప్పుకు ఓ మతాన్ని నిందించడం సరికాదన్నాడు. ఈ నెల 15న జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమా విడుదల కానుంది.

సమాజంలో ఎక్కడ, ఏ తప్పు జరిగినా ఓ మతం వారే చేశారని గుడ్డిగా నమ్మే పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొందని అబ్రహాం చెప్పాడు. ఇలాంటి ఆలోచనను బుర్ర నుంచి తీసేస్తేనే అసలు నిజం ఏమిటో మనం అర్థం చేసుకోగలమని వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచం బతకటానికి ప్రమాదకర ప్రదేశంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముంబై పోలీస్ శాఖలో అవినీతి పరులైన అధికారుల్ని హతమార్చే పోలీస్ గా జాన్ అబ్రహాం ఇందులో నటించాడు. ఈ సినిమాకు మిలప్ మిలన్ జవేరీ దర్శకత్వం వహించగా, టీ-సిరీస్ ఫిల్మ్స్, ఎమ్మె ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

More Telugu News