Pakistan: రెండు నెలల శిక్షకి.. 36 ఏళ్ల పాటు పాక్ జైలులో మగ్గిన భారతీయుడు!

  • పాక్ జైలులో చిక్కుకున్న గజేంద్ర శర్మ
  • ఈ నెల 13న విడుదల కానున్న వైనం
  • భారీ విందుకు కుటుంబ సభ్యుల ఏర్పాట్లు

పాకిస్తాన్ జైలులో 36 ఏళ్లు అకారణంగా శిక్ష అనుభవిస్తున్న గజేంద్ర శర్మ ఈ నెల 13న విడుదల కానున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ రాజస్తాన్ లోని జైపూర్ లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

జైపూర్ కు చెందిన గజేంద్ర శర్మ 1982లో పనిమీద బయటకు వెళ్లారు. అయితే పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోవడంతో ఆయనకు అక్కడి కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత శర్మకు న్యాయ సహాయం అందించేవారు ఎవ్వరూ లేకపోవడంతో ఆయన గత 36 ఏళ్లుగా లాహోర్ లోని కోట్ లఖ్ పట్ జైలులో మగ్గుతున్నారు.

కాగా, శర్మ పాక్ జైలులో ఉన్నట్లు ఈ ఏడాది మే నెలలో భారత అధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని భారత అధికారులు గురువారం శర్మ భార్య మఖాని దేవీ, కుమారుడు ముఖేశ్ కు తెలియజేశారు. పాక్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14కు ముందురోజు శర్మను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. దీంతో శర్మ కుటుంబీకుల్లో ఆనందం నెలకొంది. శర్మ రాక సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇవ్వాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News