Tamilnadu: కరుణానిధి మృతితో తమిళనాడులో డీఎంకేకు పెరుగుతున్న సానుభూతి

  • డీఎంకే వైపు మొగ్గుతున్న జనం
  • బలంగా వీస్తున్న సానుభూతి పవనాలు
  • వచ్చే ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే అవకాశం ఉందంటున్న విశ్లేషకులు

డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో తమిళనాడులో ఆ పార్టీ వైపు సానుభూతి పవనాలు వీస్తున్నాయా? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కరుణానిధి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు నేతలు తరలిరావడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సానుభూతి మరింత పెరిగి డీఎంకేకు మేలుచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ సందర్బంగా కొన్ని అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేను నడిపించే సరైన నాయకుడు ఆ పార్టీలో లేకపోవడం కూడా డీఎంకేకు కలిసి వస్తుందని చెబుతున్నారు. విభేదాల మధ్య ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పళనిస్వామి, పన్నీరు సెల్వానికి ప్రజల మద్దతు అంతంత మాత్రమే ఉందంటున్నారు.  దీంతో ప్రస్తుతం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌ను మచ్చిక చేసుకునేందుకు జాతీయ పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, కరుణానిధి వారసుడిగా స్టాలిన్ కొనసాగే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక నామమాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

More Telugu News