mumbai university: యూనివర్సిటీ వాష్ రూమ్ లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు!: ముంబైలో దారుణం

  • వాష్ రూమ్ లోకి దూరిన ఆగంతుకుడు
  • యువతితో అసభ్య చేష్టలు
  • విచారణకు ఆదేశించిన రిజిస్ట్రార్
ముంబై యూనివర్సిటీలోని మహిళల వాష్ రూమ్ లోకి దూరిన ఓ ఆగంతుకుడు యువతిని వేధించాడు. ఆమె వెంటనే ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో సదరు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై విశ్వవిద్యాలయంలోని కలీనా క్యాంపస్ లో వారం రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక్కడి మహిళల వాష్ రూమ్ లోకి ప్రవేశించిన ఆగంతుకుడు ఓ విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి ఫిర్యాదుతో విచారణ జరపాలని వర్సిటీ మహిళా విభాగాన్ని రిజిస్ట్రార్ దినేశ్ కాంబ్లే ఆదేశించారు. కాగా, యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత కొరవడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడ్ని గుర్తించలేకపోయామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. కొత్త సీసీటీవీ కోసం రూ.70 లక్షలు కేటాయించామన్నారు.
mumbai university
wash room
molested
kalina campus

More Telugu News