Vijayawada: దుర్గమ్మ చీరను దొంగిలించింది పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతే!

  • సీసీటీవీ ఫుటేజ్ లు చూసిన అధికారులు
  • ఆమెను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
  • ఆదివారం నాడు చీరను దొంగిలించిన సూర్యలత

కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన విలువైన చీర మాయం వెనుక పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతే ప్రధాన కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించడంతో గురువారం రాత్రి సూర్యలతను పాలకమండలి నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తమ శాఖాపరమైన విచారణలో సూర్యలతపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయని, అందువల్ల తాము ఆమెను తొలగించామని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. గత ఆదివారం నాడు రూ. 18 వేల విలువైన ఆషాఢ మాస సారెను కొందరు భక్తులు అమ్మవారికి బహూకరించగా, దాని విలువను తెలుసుకున్న సూర్యలత, ఆ చీరను తీసుకుని వెళ్లినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తానేమీ భక్తులు పెట్టిన చీరను తీసుకెళ్లలేదని, తనకు భక్తులు ఇచ్చిన కాటన్ చీరను మాత్రమే తీసుకెళ్లానని ఆమె వాదించినప్పటికీ, సీసీటీవీ కెమెరాలు అమ్మవారి ముందున్న చీర ఎలా మాయం అయిందో కళ్లకు కట్టినట్టు చూపాయి.

More Telugu News