YSRCP: అక్రమాస్తుల కేసులో తొలిసారి జగన్ సతీమణి పేరు.. ఈడీ చార్జిషీటులో భారతి!

  • భారతి సిమెంట్స్‌లో క్విడ్‌ప్రొ కో
  • భారతిని నిందితురాలిగా చేర్చిన ఈడీ
  • విచారణకు స్వీకరిస్తే భారతి కోర్టుకు వెళ్లాల్సిందే

అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరు తొలిసారి చార్జిషీటులోకి ఎక్కింది. భారతి సిమెంట్స్ విషయంలో జరిగిన క్విడ్ ప్రో కోలో జగన్‌తోపాటు భారతిని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిందితురాలిగా చేర్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ చార్జిషీటు దాఖలు చేశారు.

 ఈడీ చార్జిషీటును కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్ ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పుడు భారతిపై దాఖలు చేసిన చార్జిషీటును కూడా కోర్టు స్వీకరిస్తే ఆమె కూడా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది.  

  • Loading...

More Telugu News