ntr: 'అరవింద సమేత' టీజర్ వచ్చేస్తోంది

  • షూటింగు దశలో 'అరవింద సమేత'
  • ఈ నెల 15వ తేదీన టీజర్ రిలీజ్ 
  • అక్టోబర్ 11వ తేదీన సినిమా విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా .. పూజా హెగ్డే నాయికగా ఈ సినిమా నిర్మితమవుతోంది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. రెండు డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన సిక్స్ ప్యాక్ లుక్ బయటికి రావడంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమా పాటల చిత్రీకరణను ఇంకా మొదలుపెట్టకపోవడంతో, దసరాకి రిలీజ్ డౌటే అనే ప్రచారం మొదలైంది. దాంతో ఈ సినిమాను దసరాకి అంటే అక్టోబర్ 11వ తేదీన కచ్చితంగా విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ నెల 15వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఫస్టు లుక్ తో అందరినీ తన వైపుకు తిప్పుకున్న వీరరాఘవుడు, ఫస్టు టీజర్ తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి మరి. 

More Telugu News