visakha: అడగకుండానే వరాలిచ్చే పార్టీ తెలుగుదేశం: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని, అడగకుండానే వరాలిచ్చే పార్టీ తెలుగుదేశం అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం జిల్లాలోని పాడేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘గిరి ప్రగతి’ వెబ్ సైట్, జీసీసీ ఉత్పత్తులను చంద్రబాబు ఆవిష్కరించారు.

మోదుకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందని, గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. కేవలం భూములు ఇవ్వడమే కాకుండా సాగును లాభసాటిగా మారుస్తామని, గిరిజన ప్రాంతంలో పండించే జీడిపప్పుకు ప్రాధాన్యత తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గిరిజన పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపుతున్నామని, ఏపీలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి, సంక్షేమం ఈ నాలుగేళ్లలో జరిగిందని చంద్రబాబు చెప్పారు.
Go Back to Shorts
visakha
Chandrababu

More Telugu News