Telugudesam: టీడీపీని ఏ పార్టీ విమర్శించినా వారి వెనుక బీజేపీ ఉందంటున్నారు!: మాణిక్యాలరావు

  • రైల్వేజోన్ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంది
  • ప్రతి విషయాన్ని టీడీపీ రాజకీయం చేస్తోంది
  • ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ అమలవుతోంది
టీడీపీని ఏ పార్టీ విమర్శించినా వారి వెనుక భారతీయ జనతా పార్టీ ఉందంటున్నారని ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావు మండిపడ్డారు. విశాఖకు రైల్వేజోన్ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, రాజకీయ లబ్ది కోసం ప్రతి విషయాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నారని, ఆయనపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదని అన్నారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ అమలవుతోందని, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడే రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నామని వ్యాఖ్యానించారు.
Telugudesam
bjp
manikyala rao

More Telugu News