karunanidhi: 'ఉద్యోగుల సంక్షేమ నిధి' ఆయన కరుణే!

  • 1973లో సొంతూరు తిరువారూర్ వెళ్లిన కరుణ 
  • ఒక తహసీల్దార్ మరణించడంతో అంత్యక్రియలకు ఇబ్బంది పడ్డ కుటుంబం 
  • అప్పుడే 'ఉద్యోగుల సంక్షేమ నిధి' ఏర్పాటు మొగ్గతొడిగింది 

కరుణానిధి ... సార్ధక నామధేయుడు.. ఎవరైనా కష్టంలో వున్నారంటే కరిగిపోయే స్వభావం ఆయనది ..యావత్ తమిళనాడు రాష్ట్రం ఇప్పుడు తలైవా కోసం తల్లడిల్లుతోంది అంటే అది ఆ నాయకుడి ఘనత ...  ద్రవిడ రాజకీయాలను శాసించిన నాయకుడు కరుణానిధి కి గొప్ప మనసుంది. ఈ వేళ తమిళ నాట ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సంక్షేమనిధి అమలులో వుందంటే అది ఆయన కరుణే! దాని ఏర్పాటు వెనుక చిన్న కథ కూడా వుంది.

1973లో ముఖ్యమంత్రి గా వున్న సమయంలో కరుణానిధి తన సొంతూరు అయిన తిరువారూర్ వెళ్లారు. అక్కడ ఒక తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. అయితే అంత్యక్రియలు నిర్వహించటానికి ఆ బ్రాహ్మణ కుటుంబం అనుభవించిన బాధను గమనించిన కరుణానిధి ఉద్యోగుల కుటుంబ సంక్షేమ నిధి ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఉద్యోగుల సంక్షేమనిధి ఏర్పాటు చేశారు.

ఎవరైనా ప్రభుత్వోద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే వారి కుటుంబానికి వెంటనే 10 వేల రూపాయల సాయం అందించాలని నిర్ణయించారు కరుణానిధి. ఉద్యోగుల సంక్షేమ నిధి కోసం ప్రతి ఉద్యోగి వేతనం నుంచి ప్రతీ నెల 10 రూపాయలు మినహాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల భద్రతకు, ఉద్యోగుల సంక్షేమానికి ఆయన తీసుకున్న నిర్ణయం నేటికీ అమలవుతోంది.  

More Telugu News