Priyanka chopra: ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ షాక్.. అప్సెట్ అయిన ముద్దుగుమ్మ!

  • హాలీవుడ్ సినిమా చూసుకుని 'భారత్'ను వదిలేసినా ప్రియాంక 
  • తాజాగా హాలీవుడ్ సినిమా షూటింగ్ వాయిదా 
  • ఎంత సమయం పడుతుందో కూడా చెప్పని నిర్మాతలు 

సల్మాన్ ఖాన్ నటించే 'భారత్' సినిమాలో కథానాయికగా నటిస్తానని ముందుగా ఒప్పుకుని, ఆ తర్వాత 'అబ్బే, నాకు హాలీవుడ్ సినిమా వచ్చింది.. మీ సినిమా చేయలేను' అంటూ చిత్ర నిర్మాతలకు షాకిచ్చిన అందాలభామ ప్రియాంకా చోప్రాకు ఇప్పుడు హాలీవుడ్ నిర్మాతలు పెద్ద షాక్ ఇచ్చారు. తను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించటం లేదు. అందుకే అమ్మడు ఇప్పుడు అప్సెట్ అయింది.

హాలీవుడ్ సినిమా ‘కౌబాయ్‌ నింజా వైకింగ్‌’లో నటించటం కోసం 'భారత్' సినిమాను వదులుకున్న ప్రియాంకకు.. ప్రస్తుతం తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామంటూ ఆ హాలీవుడ్ చిత్రం నిర్మాతలు ప్రకటించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. షూటింగ్ షెడ్యూలింగ్ లో తలెత్తిన సమస్యల కారణంగా త్వరలో ప్రారంభం కావలసిన షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో   మొదట్లో ప్లాన్ చేసుకున్నట్టుగా ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 28న ఎట్టి పరిస్థితులలోను విడుదల కాలేదు.  

హాలీవుడ్‌ మీడియా కథనం ప్రకారం, 'కౌబాయ్‌ నింజా వైకింగ్‌' సినిమా నిర్మాణం మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి  డైరెక్టర్‌ మిచెల్‌ మెక్‌లారెన్‌ స్క్రిప్టు డెవలప్‌ చేసే పనిలో ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో కచ్చితంగా చెప్పలేమని కౌబాయ్‌ నింజా వికింగ్ నిర్మాతలు చెబుతున్నారు.

హాలీవుడ్‌ సినిమాను నమ్ముకుని 'భారత్‌' సినిమా నుంచి తప్పుకున్న ప్రియాంక ఆ సినిమా వాయిదా పడిపోవడంతో ఆలోచనలో పడింది. దాంతో సోనాలీ బోస్‌ రూపొందిస్తున్న ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ సినిమా షూటింగ్‌ లో అమ్మడు జాయిన్ అవుతోంది. ఇక 'భారత్' సినిమాలో ప్రియాంకా చోప్రా తప్పుకోవటంతో ఆ అవకాశం కాస్తా కత్రినాను వరించింది.

  • Loading...

More Telugu News