JNU: బాబోయ్.. ఈ వైస్ చాన్స్ లర్ మాకొద్దు!: తీసేయాలని ఓటేసిన 93 శాతం జేఎన్ యూ ప్రొఫెసర్లు!

  • వీసీపై అభిప్రాయ సేకరణ నిర్వహణ 
  • వీసీ తమను వేధిస్తున్నాడన్న ఫ్రొఫెసర్లు
  • కేంద్రం లోన్ నూ తిరస్కరించాలని నిర్ణయం

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వర్సిటీ వైస్ చాన్స్ లర్ జగదీశ్ కుమార్ ను తొలగించాలా? కొనసాగించాలా? అన్న అంశంపై నిర్వహించిన రెఫరెండంలో 93 శాతం మంది ప్రొఫెసర్లు ఆయన్ను సాగనంపాలని ఓటేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వర్సిటీలో సమస్యల్ని ప్రస్తావించే ప్రొఫెసర్లను వీసీ లక్ష్యంగా చేసుకుంటున్నారని ఓటింగ్ అనంతరం జేఎన్ యూ టీచర్స్ అసోసియేషన్ ఆరోపించింది. మొత్తం 300 లిస్టెడ్ ఫ్యాకల్టీ పాల్గొన్న ఈ రెఫరెండమ్ లో 279 మంది వీసీని తొలగించాలంటూ ఓటేశారని వెల్లడించింది.

వీసీ జగదీశ్ కుమార్ వర్సిటీలో భయానక వాతావరణాన్ని సృష్టించారని జేఎన్ యూ టీచర్స్ అసోసియేషన్ విమర్శించింది. అలాగే కేంద్రం నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏజెన్సీ(హెచ్ఈఎఫ్ఏ) ద్వారా భారీ లోన్ ను తీసుకోవాలన్న వర్సిటీ ప్రతిపాదనను కూడా రెఫరెండమ్ లో ప్రొఫెసర్లు తిరస్కరించారు. ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారిలో 96 శాతం మంది లోన్ తీసుకోవాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు.

  • Loading...

More Telugu News