ICC: 2019 ప్రపంచకప్ ప్రమోషనల్ సాంగ్ విడుదల.. అదరగొట్టిన ఫ్లింటాఫ్!

  • ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఐసీసీ
  • ఆకట్టుకుంటున్న‘ఆన్ టాప్ ఆప్ ది వరల్డ్’ గీతం
  • 2019, మేలో మొదలుకానున్న టోర్నీ
వచ్చే ఏడాది ఇంగ్లండ్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసింది. ఇంగ్లండ్ మాజీ అల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్ లో రూపొందించిన ఈ పాట క్రికెట్ ప్రేమికుల్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ వీడియోను ఐసీసీ తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తొలుత ‘ప్రపంచకప్ వచ్చేస్తోంది’ అని పేపర్ లో చదివిన ఫ్లింటాఫ్.. విజిల్ వేస్తూ ‘ఆన్ టాప్ ఆప్ ది వరల్డ్’ పాటను అందుకుంటాడు. దీంతో ఫ్లింటాప్ వద్దకు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్ చేరుకుని సందడి చేస్తారు. ఈ సందర్భంగా వేర్వేరు దేశాలకు చెందిన జెండాలతో అభిమానులు డ్యాన్స్ చేస్తూ వీధుల గుండా వెళుతుంటే, వీరిని చాలామంది ఫాలో అవుతారు.

ఇంగ్లండ్, వేల్స్ లో వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకూ వన్డే ప్రపంచకప్ జరగనుంది. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్ సహా 14 దేశాలు పోటీపడుతున్నాయి.
ICC
World cup
Odi
england
wales
on top of the world
andrew flintoff

More Telugu News