Karunanidhi: కరుణానిధి అంత్యక్రియలు జరిగే ప్రాంతమిదే... మ్యాప్ వ్యూ!

  • సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు
  • 3 గంటలకు ప్రారంభం కానున్న అంతిమయాత్ర
  • శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు

ఈ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లోని అన్నాదురై స్మారకానికి పక్కనే జరిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం మూడు గంటల తరువాత రాజాజీ హాల్ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అంతిమయాత్ర సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు జరగనుంది. కాగా, ఇప్పటికే మెరీనా బీచ్ లో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత అంత్యక్రియలు జరిగాయి. ఎంజీఆర్ సమాధి వెనుక వైపున జయలలిత అంత్యక్రియలు జరుగగా, అన్నాదురై సమాధి వెనుక ప్రాంతంలో కరుణానిధి అంత్యక్రియలకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News