kurunanidhi: చెన్నైలో దిగిన ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన పళనిస్వామి!

  • 10.38 కి చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరిన మోదీ 
  • హెలికాప్టర్ ద్వారా రాజాజీ హాల్ కు వెళ్లనున్న ప్రధాని
  • కరుణకు నివాళి అర్పించనున్న మోదీ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి నివాళి అర్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చెన్నైకి చేరుకున్నారు. ఉదయం 10.38 కి చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మరికొందరు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాజాజీ హాల్ కు చేరుకోనున్నారు. కరుణానిధి మంగళవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
kurunanidhi
Narendra Modi
chennai
rajaji hall

More Telugu News