Karunanidhi: తాళిబొట్టే కారణం... జీవితాంతం అవివాహితగానే ఉండిపోయిన కరుణానిధి తొలి ప్రియురాలు!

  • హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకుడైన కరుణానిధి
  • 1944లో ఓ యువతిని ప్రేమించిన కరుణానిధి
  • తాళి కట్టేందుకు అంగీకరించకపోవడంతో ఆగిన వివాహం

హిందూ సంప్రదాయాలకు, దైవారాధనకు పూర్తి వ్యతిరేకుడైన కరుణానిధి తన తొలి ప్రియురాలిని వదులుకున్న ఘటనను చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆన్ నూల్ అల్లా గుర్తు చేసుకున్నారు. పెళ్లికి గుర్తుగా నిలిచే తాళిబొట్టును ప్రియురాలి మెడలో కట్టేందుకు ఆయన ససేమిరా అన్నారట. 1944 ప్రాంతంలో కరుణానిధి ఓ అమ్మాయిని ప్రేమించగా, వారికి వివాహం చేసేందుకు ప్రియురాలి కుటుంబీకులు అంగీకరించారట.

అయితే, సంప్రదాయబద్ధంగా వివాహం జరగాలని వారు కోరితే, తనకు తాళిబొట్టన్నా, మంత్రాలన్నా పడవని తెగేసి చెప్పిన ఆయన, అవి లేకుండా వివాహమంటే సరేనని అన్నారట. దీంతో ఆ పెళ్లి ఆగిపోయిందని, దీంతో ఆవేదన చెందిన కరుణ ప్రియురాలు మరో వివాహం చేసుకోకుండా జీవితాంతం అవివాహితగానే ఉండిపోయిందని నూర్ తెలిపారు. ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించే కరుణ, ఆ తరువాత ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు. పెద్ద భార్య పద్మావతి చాలా సంవత్సరాల క్రితమే మరణించగా, ప్రస్తుతం రెండో భార్య దయాళు అమ్మాళ్, మూడో భార్య రాజాథీ అమ్మాళ్ ఉన్నారు.

More Telugu News