karunanidhi: కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించిన మమతా బెనర్జీ, రజనీకాంత్

  • నేడు మరికొందరు ప్రముఖుల రాక
  • అంత్యక్రియల్లో పాల్గొననున్న ప్రధాని
  • కరుణ కుటుంబ సభ్యులకు పరామర్శల వెల్లువ
మంగళవారం కన్నుమూసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి పార్థివదేహానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాళులర్పించారు. కరుణ మృతి వార్త తెలిసిన వెంటనే చెన్నైకి చేరుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరుణ పార్థివ దేహాన్నిసందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మరో సినీనటుడు అజిత్ కూడా షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకి పయనమయ్యారు. మరోవైపు నేడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు చెన్నై రానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నగరానికి  చేరుకుని కరుణ అంత్యక్రియల్లో పాల్గొంటారు.  
karunanidhi
Chennai
Tamilnadu
Arvind Kejriwal

More Telugu News