annadurai: అన్నాదురై సమాధి వద్ద కరుణానిధి పార్థివదేహం ఖననానికి అనుమతించని ప్రభుత్వం!

  • న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయన్న ప్రభుత్వం
  • కరుణ భౌతికకాయం ఖననానికి గిండిలో స్థలం కేటాయిస్తామన్న పళని
  • భౌతికకాయాన్ని గోపాలపురంలోని నివాసానికి తరలించే ప్రయత్నాలు

చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో మృతి చెందిన కరుణానిధి భౌతిక కాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్ లో కరుణ భౌతికకాయాన్ని ఉంచనున్నట్టు తెలుస్తోంది. అన్నాదురై సమాధి వద్దే కరుణానిధికి కూడా సమాధి ఏర్పాటు చేయాలన్నది డీఎంకే నేతల ఆలోచన.

ఈ విషయమై తమిళనాడు సీఎం పళనిస్వామికి కరుణానిధి కుటుంబసభ్యులు, డీఎంకే నేతలు విఙ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే, అన్నాదురై సమాధి వద్దే కరుణ పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ప్రభుత్వం అనుమతించలేదని తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని చెప్పినట్టు సమాచారం. గిండిలో రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని కరుణ కుటుంబసభ్యులకు తమిళనాడు ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది.

More Telugu News