karunanidhi: కరుణానిధి మృతిపై గవర్నర్, చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ సంతాపం

  • కరుణ మృతి యావత్తు దేశానికే తీరని లోటు: గవర్నర్
  • దేశం రాజకీయ యోధుడిని కోల్పోయింది: చంద్రబాబు
  • కరుణానిధి చిరస్థాయిగా నిలిచిపోతారు: కేసీఆర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. కరుణానిధి మరణ వార్త యావత్తు దేశానికే తీరని లోటని నరసింహన్ అన్నారు.
 
ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారు

దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. సాహిత్యం, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కరుణానిధి విశేష కృషి చేశారని కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని, నిరుపేదలు బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పరితపించారని అన్నారు.

ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి కరుణానిధి అని, దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ అన్నారు. కాగా, రేపు కరుణానిధి అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.

కాగా, కరుణానిధి మృతికి ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తమ సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News