karunanidhi: కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం

  • కరుణ ఆత్మకు శాంతి చేకూరాలి
  • దేశం ..ముఖ్యంగా తమిళనాడు ఆయన్ని కోల్పోయింది
  • ఓ ఫొటోను పోస్ట్ చేసిన మోదీ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయన అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. భారత దేశం .. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఆయన్ని కోల్పోయిందని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. రేపు ఉదయం మోదీ చెన్నై వెళ్లి, కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.

కాగా, కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానలు విషాదంలో మునిగిపోయారు. తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

  • Loading...

More Telugu News