karunanidhi: కరుణానిధి ఆరోగ్యం విషమం.. మద్యం షాపులు మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలు!

  • కావేరి ఆసుపత్రి వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు  
  • గోపాలపురంలోని కరుణ నివాసం వద్ద హై సెక్యూరిటీ
  • చెన్నైలో మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు

చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై, గోపాలపురంలోని కరుణానిధి నివాసం వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోపక్క చెన్నైలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లోగా మద్యం షాపులు మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కావేరి ఆసుపత్రి వద్దకు ఇప్పటికే కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

  • Loading...

More Telugu News