Mumbai: మత్స్యకారులు లాటరీ కొట్టారు... రూ. 5.50 లక్షలకు అమ్ముడైన చేప!

  • మత్స్యకార సోదరుల వలకు చిక్కిన ఘోల్ ఫిష్
  • చేప అవయవాలను వైద్య రంగంలో వాడుతున్న నిపుణులు
  • ముంబైలో భారీ ధరకు అమ్ముడుపోయిన వైనం

ముంబైలోని ఆ మత్స్యకారులు లాటరీ కొట్టారు. వారి వలలో అత్యంత అరుదైన 30 కిలోల బరువున్న హై గ్రేడ్ 'ఘోల్ ఫిష్' చిక్కగా, సోమవారం నాడు దాన్ని వారు రూ. 5.50 లక్షలకు విక్రయించారు. వైద్య రంగంలో ఈ చేప ఇంటర్నల్ ఆర్గాన్స్ వాడకం విరివిగా ఉన్నందునే ఈ చేపకు ఇంత ధర పలికింది.

ముంబై - పాల్ ఘర్ తీర ప్రాంతంలో మహేష్ మెహెర్, అతని సోదరుడు భరత్ ఓ చిన్న బోటులో శుక్రవారం నాడు వేటకు వెళ్లగా, ఈ చేప వలకు చిక్కింది. తూర్పు ఆసియా ప్రాంతంలో ఈ తరహా చేపలు అధికంగా చిక్కుతాయని, దీనికి 'హార్ట్ ఆఫ్ గోల్డ్ ఫిష్' అని కూడా పేరుందని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. ఈ తరహా లో-గ్రేడ్ చేప కిలో బరువున్నా రూ. 1000 వరకూ ధర పలుకుతుందని, వీటిని సాధారణంగా మలేషియా, సింగపూర్, హాంకాంగ్, జపాన్ లకు ఎగుమతి చేస్తుంటామని స్థానిక మత్స్యకారులు వెల్లడించారు. కాగా, గడచిన మే నెలలో ఇదే తరహా హై గ్రేడ్ 'ఘోల్ ఫిష్' ఒకటి వలలో చిక్కితే దానికి రూ. 5.20 లక్షల ధర పలికింది.

More Telugu News