Strike: ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు, ఆటోలు, క్యాబ్ లు... దేశమంతా ప్రజల అవస్థ!

  • నేడు దేశవ్యాప్తంగా వాహనాల సమ్మె
  • ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు తీవ్ర ఇబ్బంది
  • కిక్కిరిసిన మెట్రో, లోకల్ రైళ్లు

మోటారు వాహనాల సవరణ బిల్లు-2017కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనదారులూ సమ్మె చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ బస్సులు, లారీలు, ఆటోలు, క్యాబ్ లూ తిరగడం లేదని తెలుస్తోంది. ఈ ఉదయం ఆఫీసులకు వెళ్లాల్సిన వారు నానా అవస్థలు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆర్టీసీ డిపోలూ బంద్ కు మద్దతు పలికాయి. దీంతో బస్సులు రోడ్లపైకి రాలేదు.

ఈ కొత్త వాహనాల చట్టం వాహన యజమానులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తున్న పలు సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో సెట్విన్ బస్సులు మినహా మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వాహనాలూ తిరగడం లేదు. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై తదితర మహానగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నగరాల్లో మెట్రో, లోకల్ రైల్ సేవలు కొనసాగుతుండటంతో, అవి కిక్కిరిసిపోయాయి. డీజెల్, పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కూడా వాహన యజమానులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News