bullock cart: ఏపీ సచివాలయంలో ఎడ్లబండితో రైతు కుటుంబం.. కళాకారుని ప్రతిభకు సందర్శకుల ఫిదా!

  • సచివాలయ పార్క్‌లో ఎద్దుల బండితో రైతు కుటుంబం
  • జీవకళ ఉట్టేపడేలా ఉన్న విగ్రహం
  • చూసేందుకు ఎగబడుతున్న సందర్శకులు
ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో ఎడ్లబండి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బండినిండా ధాన్యం బస్తాలు, దానిపై రైతు కుటుంబం, బండి ముందు నడుస్తున్న రైతు... జీవకళ ఉట్టిపడుతున్న ఈ విగ్రహం సచివాలయంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. కొంచెం దూరం నుంచి చూస్తే మాత్రం ఓ రైతు ఎడ్లబండితో సరాసరి సచివాలయంలోకి వెళ్తున్నట్టు భ్రమపడకమానరు. 

అయితే, దగ్గరికి వెళ్లి తట్టి చూస్తే తప్ప అది బొమ్మ అని తెలియదు. అంత అద్భుతంగా, జీవకళ ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దారు. సచివాలయ పార్కులో ఏర్పాటు చేసిన ఈ బొమ్మ అందరినీ ఆకర్షిస్తోంది. సందర్శకులు ముచ్చటపడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్ట్ డైరెక్టర్ పీవీ అంబాజీ ఫైబర్‌ మెటీరియల్ తో దీనిని రూపొందించారు. తయారీకి రెండు నెలల సమయం పట్టగా, రూ.9 లక్షల వరకు ఖర్చు అయిందని అంచనా.  
bullock cart
Andhra Pradesh
Amaravathi
Secratariat

More Telugu News