Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగబ్బాయిని చేసుకుంటుందట! 
  • కమల్ చిత్రంలో బాలీవుడ్ నటుడు 
  • కైరా అద్వానీకి మరో భారీ ఆఫర్ 
  • విజయ్ దేవరకొండతో రష్మిక మరో సినిమా     
*  తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెబుతోంది కథానాయిక రాశిఖన్నా. "శ్రీనివాస కళ్యాణం సినిమా చేశాక వివాహ బంధం మీద ఎంతో నమ్మకం ఏర్పడింది. సంప్రదాయ బద్ధమైన తెలుగు వివాహ తంతు ఎంతో నచ్చింది. నా పెళ్లి కూడా ఇలాగే చేసుకోవాలని, అన్నీ కుదిరితే తెలుగింటి అబ్బాయినే చేసుకోవాలని వుంది" అంటూ చెప్పుకొచ్చింది రాశిఖన్నా.
*  కమలహాసన్ ప్రధాన పాత్రధారిగా శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ఇందులో ఓ కీలక పాత్రకు గాను బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ను ఎంచుకున్నారు.
*  'భరత్ అనే నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ప్రవేశం చేసి, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ కైరా అద్వానీకి తమిళం నుంచి ఓ భారీ ఆఫర్ వచ్చింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించే చిత్రంలో కథానాయిక పాత్ర కోసం కైరా అద్వానీని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.
*  విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' చిత్రం ఈ 15న విడుదలవుతోంది. మరోపక్క, ఈ జంట నటించే రెండో చిత్రం 'డియర్ కామ్రేడ్' నిన్న షూటింగును ప్రారంభించుకుంది. దీనికి భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.
Rashi Khanna
Kamal Haasan
Kaira
YS Vijayamma

More Telugu News