Andhra Pradesh: కృష్ణా జిల్లా గరికపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకదాన్నొకటి ఢీకొన్న మూడు బస్సులు, కారు!

  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన
  • ఓ బస్సు డ్రైవర్ మృతి
  • 25 మందికి గాయాలు
కృష్ణా జిల్లా గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు, ఓ కారు  ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాగా, పెను ప్రమాదం జరిగినా భారీ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
Andhra Pradesh
Road Accident
Vijayawada
Hyderabad

More Telugu News