Mahesh Babu: మహేశ్ బాబు సినిమా టైటిల్ ఆ అక్షరాలలోనే ఉందా?

  • సినిమా టైటిల్ పై అభిమానుల చర్చ 
  • రోజుకొక అక్షరం రిలీజ్ చేస్తున్న చిత్రం టీమ్ 
  • ఆ అక్షరాలను బట్టి టైటిల్ ఊహిస్తున్న ఫ్యాన్స్

మహేశ్ బాబు అభిమానులు ఇప్పుడు తెగ ఆలోచిస్తున్నారు. దేని గురించి అంటారా? తమ అభిమాన నటుడు నటిస్తున్న 25వ చిత్రం టైటిల్ గురించి! వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ఇప్పుడిలా సెన్సేషన్ అవడానికి కారణం, ఆ చిత్ర బృందం విడుదల చేస్తున్న కొన్ని అక్షరాలే!

ఆ వివరాలలోకి వెళితే, రెండు రోజుల క్రితం ఈ చిత్రం టీమ్ R అనే అక్షరంతో కూడిన పోస్టర్ ను సామాజిక మాధ్యమాలలో రిలీజ్ చేసింది. నిన్న I అక్షరాన్ని రిలీజ్ చేయగా.. నేడు S అక్షరాన్ని విడుదల చేసింది. అంతేకాదు, ఆ అక్షరాలకు తమదైన శైలిలో అర్థాన్ని కూడా వివరించింది.

దీంతో ఈ అక్షరాలను బట్టి అభిమానులు సినిమా టైటిల్ని ఊహిస్తున్నారు. టైటిల్ 'రిషి' అయివుండచ్చని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై అభిమానుల మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. కాగా, ఈ నెల 9న మహేశ్ జన్మదినం సందర్భంగా టైటిల్ని, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి చిత్రం టీమ్ సన్నాహాలు చేస్తోంది. అప్పటివరకు ఇది సస్పెన్సే మరి! 

More Telugu News