Chandrababu: భారీ బ్యాటరీని ఆవిష్కరించిన చంద్రబాబు

  • ‘భారత్ ఎనర్జీ స్టోరేజీ’ భారీ బ్యాటరీ
  • యువత అసాధ్యాలను సుసాధ్యం చేయాలి
  • ఏపీలో నాణ్యమైన విద్యుత్ రూ.5 కే లభిస్తోంది

హైఎనర్జీ బెనిఫిటి స్టోరేజీ బ్యాటరీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అమరావతిలోని ప్రజావేదిక హాల్ లో చంద్రబాబు అధ్యక్షతన ఓ కార్యక్రమం జరిగింది. భారత్ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చిన విద్యుత్ నిల్వ పరికరాన్ని పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల మధ్య చంద్రబాబు ఆవిష్కరించారు. 

అనంతరం, ఆయన మాట్లాడుతూ, తక్కువ ధరలకే వినియోగదారులకు నాణ్యమైన యూనిట్ విద్యుత్ అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం నాణ్యమైన యూనిట్ విద్యుత్ రూ.5 కే లభిస్తోందని, దీని ధర రూ1.50 నుంచి రూ.2కి తగ్గించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు అన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంపై యువత దృష్టి సారించాలని, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యం కాదన్న స్థాయి నుంచి చౌక ధరకు కాలుష్య రహిత ఇంధనం ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.  

More Telugu News