sitakka: మహిళలను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోంది: 'గండ్రపై లైంగిక ఆరోపణల'పై సీతక్క

  • గండ్రను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆరోపణలు
  • ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయాలని టీఆర్ఎస్ చూస్తోంది
  • గండ్రపై ఆరోపణలపై డీజీపీతో విచారణ జరిపించాలి
కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై విజయలక్ష్మి అనే మహిళ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని గండ్ర కొట్టిపారేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సీతక్క మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో గెలిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. గండ్ర వెంకటరమణారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గండ్రపై విజయలక్ష్మి చేసిన అసత్య ఆరోపణలపై డీజీపీతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
sitakka
Congress
TRS

More Telugu News