Kerala: దుల్కర్ సల్మాన్ ను చూసేందుకు వచ్చిన అభిమాని తొక్కిసలాటలో మృతి!

  • కొల్లాంలో మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్
  • వేల సంఖ్యలో వచ్చిన ఫ్యాన్స్
  • తొక్కిసలాటలో హరి అనే వ్యక్తి మృతి
కేరళలోని కొల్లాంలో ఓ మాల్ ప్రారంభోత్సవానికి హీరో దుల్కర్ సల్మాన్ వచ్చిన వేళ, విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి కొట్టారక్కర, ఎంసీ రోడ్ లో మాల్ ను ప్రారంభించేందుకు దుల్కర్ ముఖ్య అతిథిగా రాగా, ఆయన్ను చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఆ సమయంలో అభిమానులను అదుపు చేసేందుకు చాలినంత మంది సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో, తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఈ ఘటనలో తిరువనంతపురంకు చెందిన హరి (45) మరణించాడు. తొక్కిసలాటలో హరి కుప్పకూలడాన్ని చూసిన పోలీసులు, అతన్ని తమ వాహనంలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.  
Kerala
Kollam
Mall Opening
Dulkar Salman
Fans
Stampade

More Telugu News