Surat: తల్లిపాలు ఇచ్చేందుకు ‘అమ్మ’ల క్యూ.. మిల్క్ డొనేషన్ క్యాంపునకు విశేష స్పందన!

  • అనాథలు, తల్లిపాలు అందని వారి కోసం మిల్క్ డొనేషన్ క్యాంపు
  • వందమందికిపైగా తరలివచ్చిన తల్లులు
  • పాశ్చరైజేషన్ అనంతరం భద్ర పరచనున్న వైద్యులు

తల్లి పాలు అందక అల్లాడిపోతున్న శిశువులకు పాలు అందించేందుకు ‘అమ్మ’లు ముందుకొచ్చారు. గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన ‘మిల్క్ డొనేషన్’ క్యాంపునకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు తల్లిపాలు ఇచ్చారు. మొత్తం 130 మంది మహిళలు క్యాంపునకు చేరుకుని పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకున్నారు.

గుజరాత్‌లో గత కొంతకాలంగా తల్లిపాల డొనేషన్ కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారు. అనాథలు, తల్లిపాలు అందని వారి కోసం పాలు సేకరించి అందిస్తున్నారు. తాజాగా, సూరత్ పిడియాట్రిక్ అసోసియేషన్, యశోదా మిల్క్ బ్యాంక్, కచ్ కడవా పటీదార్ మహిళా మండల్ ఆధ్వర్యంలో ఆదివారం మిల్క్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. 130 మంది పాలిచ్చే తల్లులు ముందుకొచ్చి పాలిచ్చారు. వీరి నుంచి సేకరించిన పాలను పాశ్చరైజేషన్‌కు పంపిన అనంతరం సూరత్‌లోని యశోదా హ్యూమన్ మిల్క్ బ్యాంకు డీప్ ఫ్రీజర్‌లో భద్ర పరుస్తారు.

More Telugu News