Gudhachari: 'గూఢచారి' అద్భుతమన్న నారా లోకేశ్!

  • నిన్న సినిమాను చూసిన నారా లోకేశ్
  • ప్రతి నిమిషాన్నీ ఎంజాయ్ చేశాను
  • నటీనటులు ఎంతో కష్టపడ్డారన్న లోకేశ్

గత వారం విడుదలైన 'గూఢచారి' చిత్రంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. నిన్న ఈ సినిమాను చూసిన లోకేశ్, రాత్రి 9.16 గంటల ప్రాంతంలో తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "స్పై మూవీగా తయారైన ఈ చిత్రంలో ప్రతి నిమిషాన్నీ నేను ఎంతో ఎంజాయ్ చేశాను. అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, శశి కిరణ్ ఇతర తారాగణం, సినిమా క్రూ ఎంతో కష్టపడ్డారు" అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే అభినందనలు తెలుపుతుండగా, చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది.

More Telugu News