Gandra venkata ramana reddy: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్రపై లైంగిక ఆరోపణలు.. బాధిత మహిళ ధర్నా!

  • గండ్ర ఇంటి వద్ద మదర్ ఫౌండేషన్ ప్రతినిధి ధర్నా
  • నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
  • మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. గండ్రపై కేసు నమోదు
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత  గండ్ర వెంకటరమణారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తనను శారీరకంగా వాడుకుని  ఆపై వదిలేశారంటూ మదర్ ఫౌండేషన్ ప్రతినిధి కొమురెల్లి విజయలక్ష్మి ఆరోపించారు. ఈ మేరకు హన్మకొండ, వడ్డేపల్లిలోని జీఎంఆర్ అపార్ట్‌మెంట్ వద్ద ధర్నా నిర్వహించారు. తనను అన్యాయం చేసిన గండ్రపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  

సంస్థలో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో తనకు గండ్రతో పరిచయం అయిందని ఆమె తెలిపారు. అది మరింత పెరిగి, ఇద్దరి మధ్య చనువు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా గండ్ర తనను శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఇటీవలి వరకు తనతో చనువుగానే ఉన్నాడని, కానీ ఈ నెల 3న ఆయనను కలిసేందుకు జీఎంఆర్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా పోలీసులకు సమాచారమిచ్చి తనను అరెస్ట్ చేయించారని ఆమె ఆరోపించారు. కాగా, రోడ్డుపై ధర్నా చేస్తున్న విజయలక్ష్మిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద గండ్ర వెంకటరమణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  
Gandra venkata ramana reddy
Telangana
Warangal
Congress

More Telugu News