saudi arabia: నా భార్యను సౌదీ షేక్ కు అమ్మేశారంటూ కంటతడి పెడుతున్న కడప జిల్లా వాసి!

  • సౌదీ షేక్ కు బాధితురాలిని అమ్మేసిన రైల్వే కోడూరుకు చెందిన ఏజెంట్
  • ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందంటున్న భర్త
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదంటూ ఆవేదన
గల్ఫ్ ఏజెంట్ తమను నమ్మించి మోసం చేశాడని, తన భార్యను సౌదీ అరేబియాకు చెందిన ఓ షేక్ కు అమ్మేశాడంటూ కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం జీవీ పురం ఎస్సీ కాలనీకి చెందిన సాల్వ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని, వెంటనే ఆమెను ఇండియాకు రప్పించాలని వేడుకున్నాడు. రైల్వే కోడూరుకు చెందిన ఏజెంట్ తమను మోసగించాడని చెప్పాడు. 2017 ఆగస్టు 4న తన భార్యను అమ్మేశాడని తెలిపాడు.

షేక్ కుటుంబసభ్యులు తన భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని వెంకటరమణ కంటతడి పెట్టాడు. ఇండియాకు రప్పించలేకపోతే, ఆత్మహత్య చేసుకుంటానంటూ తన భార్య ఏడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డాడు. తమను మోసగించిన ఏజెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. 
saudi arabia
agent
wife
sold
kadapa

More Telugu News